లక్ష్యానికి దూరంగా వనం-మనం

మొక్కలు నాటడంలో అలసత్వం
గుంటూరు,నవంబర్‌9 (జనం సాక్షి):   వనం-మనం కార్యక్రమాన్ని వర్షాకాలం పూర్తి అయ్యేవరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా లక్ష్యం చేరుకోవడం లేదు. ప్రజలను భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశిరచింది. ఆమేరకు అటవీశాఖ మొక్కలను
సిద్ధంచేసింది. శాఖలవారీగా మొక్కలు పంపిణీని కూడా అటవీశాఖ చేపట్టింది. ఒక్కొక్క ప్రభుత్వశాఖకు వేలాది మొక్కలను సరఫరా చేసింది. వీటిని క్షేత్రస్థాయిలో ప్రభుత్వశాఖల వారీగా నాటడంలో నిర్లక్ష్యం తాండవిస్తున్నది. వ్యవసాయ, దేవదాయ, మైన్స్‌, గృహనిర్మాణ శాఖలు తమకిచ్చిన లక్ష్యాలలో ఒక మొక్కను కూడా ఇప్పటికీ నాటలేదని అటవీశాఖ తన నివేదికలో పేర్కొ ంది. ఈ నేపథ్యంలో వనం-మనం అమలులో ఆయా శాఖల అధికారుల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. శాఖలవారీగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు… ఇప్పటివరకు శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను అటవీశాఖ తన వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటించింది. పట్టణాలలో కూడా వనం-మనం అమలు అంతంత మాత్రంగానే ఉంది. మునిసిపాలి టీల వారీగా ఇచ్చిన లక్ష్యాల మేర మొక్కలు నాటుతున్న దాఖలాలు లేవు.  నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం లో కొన్ని పురపాలక సంఘాలు వెనుకబడ్డాయి. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, సత్తెనపల్లి, తెనాలి, చిలకలూరిపేట, వినుకొండ, రేప్లలె, పిడుగురాళ్ళ మునిసిపాల్టీలు మొక్కలను నాటడంలో లక్ష్యాలకు ఆమడ దూరంలో ఆగిపోయ్యాయి. బాపట్ల, మాచర్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి పురపాలకసంఘాలు లక్ష్యాలను మించి మొక్కలు నాటాయి. జిల్లా అంతటా ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను నిర్దేశించింది.  ప్రజలను భాగస్వా మ్యులను చేసి వనం- మనంను విస్తృతంగా అమలుచేసేందుకు అన్ని శాఖల అధికారులు చిత్త శుద్ధితో కృషిచేస్తేనే ఈ కార్యక్రమం విజయ వంత మవుతుందని చెప్పవచ్చు. నాటిన మొక్కలను సంరక్షించే చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది. వనం-మనం అమలుతో పాటు ఉన్న చెట్లను సంరక్షించేందుకు ప్రభు త్వం కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.