లక్ష మెజార్టీ ఖాయమంటున్న మధుసూధనాచారి

అందుబాటులో ఉండే నేత కావాలన్నదే ప్రజల ఆకాంక్ష
భూపాలపల్లి,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రస్తు ప్రచార సరళి, ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని  మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని, అలాగే తమకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలని చూస్తున్నారని అన్నారు.  గత నెలరోజులులగా వివిధ ప్రాంతాల్లో తాను పర్యటించి ప్రజలతో కసలి ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ పాలన, భూపాలపల్లి నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేపట్టని విధంగా జరిగిన అభివృద్ధి పనులను చూసిన ప్రజల అండా పుష్కలంగా ఉందన్నారు. ప్రజలు కూడాగతంలో జరిగిన పనులకు ఈ నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ది పనులను బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. ఇకపోతే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  అది మహాకూటమి కాదని ఓ మాయాకూటమి అని విమర్శించారు. జెండా.. ఏజెండా లేని మోసగాళ్ల మాటలు ప్రజలు నమ్మె స్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అసలు ప్రజాసేవ అనేదానికి అర్థం తెలియదని, వారికి తెలిసింది వారి వ్యాపారాలు, సొంత అభివృద్ధి మాత్రమేనని ఎద్దేవా చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో దాదాపుగా రూ.2500 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే రెట్టింపు స్థాయిలో అభివృద్ధి నిధులు మంజూరు చేస్తానని ఆయన పేర్కొన్నారు.