లక్సెట్టిపేటలోభారీగా రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. దాదాపుగా వంద క్వింటాళ్ల బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా అధికారులు పట్టుకుని లారీని సీజ్ చేసారు. కాగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.