లబ్దిదారులకే నేరుగా నగదు బదిలీ : ప్రధాని
న్యూఢిల్లీ : లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్ సోమవారం ప్రకటించారు. ఈ పథకం కింద రాయితీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు చేరుతుంది. 2013 జనవరి నుంచి 51 జిల్లాల్లో ఈ పథకాన్ని ఈ పథకాన్ని ప్రవేశపెడతారు. ప్రత్యక్ష బదిలీపై జాతీయ కమిటీ మొదటి విడత సమావేశంలో ప్రధాని మాట్లాడతారు. సత్వరమే ఈ పథకాన్ని అమలు చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. రాష్ట్రాలలలో డాటాబేస్‌లను డిజిటలైజ్ చేయాలని తరువాత ఆదార్ కార్డుల నంబర్లతో అనుసంధానం చేయాలని చెప్పారు. ఐటీ మంత్రిత్వశాఖ, యూఐడీ అథారిటీ సంస్థలు ఇందుకు సహకారం అందిస్తాయన్నారు. ఇందువల్ల వృథాను అరికట్టడం జరుగుతుందన్నారు. లీకేజ్‌లు లేకుండా చూడవచ్చని లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం వెచ్చించే ప్రతిరూపాయి సక్రమంగా వినియోగం అయ్యేట్లు చూడవచ్చన్నారు.