లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.
చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు ₹5,91,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన జుమ్మిడి గంగయ్య ఇటీవల మరణించగా ఆయన భార్య సాలక్కకు టీఆరెస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు ₹ రెండు లక్షల చెక్కును, బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామానికి చెందిన సాయి అనారోగ్యంతో బాధపడుతున్నందున వారి కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స నిమిత్తం ₹ రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేశారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, నెన్నెల మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, నియోజకవర్గం టీఆరెస్ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్, నాయకులు భీమా గౌడ్, శ్రీధర్, మల్లేష్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.