లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని ఐఎంఏలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట, లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి , లయన్స్ క్లబ్ ఆఫ్ స్పందన ,లయన్స్ క్లబ్ ఆఫ్ మునగాల ,లయన్స్ క్లబ్ ఆఫ్ మునగాల , లయన్స్ క్లబ్ ఆఫ్ నూతన్ కల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.నూతనంగా ఎన్నికైన సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండాలని సూచించారు.పేద ప్రజలకు తమ వంతు సేవను అందించాలని అన్నారు.గ్రామాల్లో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.స్థానిక జనరల్ హాస్పిటల్ లో గుండె జబ్బుల నివారణకు రూ .45వేలు విలువ గల ఖరీదైన ఇంజక్షన్ అందుబాటులో ఉందని,అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపారు.లయన్స్ క్లబ్ ఇంజక్షన్ ఆఫీసర్ రామానుజచార్యులు నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.లయన్స్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీ  అధ్యక్షులుగా డాక్టర్ రమేష్ చంద్ర , సెక్రటరీ గా యాద కిరణ్ కుమార్ , కోశాధికారిగా రాచకొండ శ్రీనివాస్ , వైస్ ప్రెసిడెంట్లుగా పాశం అనంతరాములు , గవ్వ కృష్ణారెడ్డి , మెంబర్ షిప్ చైర్మన్ గా ముద్ద భిక్షపతి యాదవ్ , సర్వీస్ ఛైర్మన్ గా కుమ్మరికుంట్ల లింగయ్య , మార్కెటింగ్ చైర్ పర్సన్ గా వాంకుడోతు వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, గవర్నర్ అమృతపల్లి కోటేశ్వరరావు , లయన్ గండూరి కృపాకర్, ఉప్పల రాజేంద్రప్రసాద్, చిలుమల  శ్రీనివాస రెడ్డి,  నూకల వెంకటరెడ్డి, బండారు రాజా, మర్రు హనుమంతరావు, దోసపాటి గోపాల్, పటేల్ నర్సింహ రెడ్డి, కెవి ప్రసాద్, రాచర్ల కమలాకర్ ఉప్పల సంపత్ కుమార్, వెంపటి యదే శ్వరావు,  యమా రామ్మూర్తి,   గుడిపూడి వెంకటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.