లలితా దేవి అవతారంలో అమ్మవారు
అశ్వారావుపేట, సెప్టెంబర్ 28(జనంసాక్షి )
అశ్వారావుపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం వద్ద 47వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు భక్తులకు శ్రీ మాంగళ్య గౌరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలను పురష్కరించుకొన ఆలయలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు, సహస్ర నామార్చనలు జరిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా స్థానిక జంగారెడ్డిగూడెం రోడ్లోని కనకదుర్గమ్మ ఆలయం, శిరిడిసాయిబాబా దేవాలయం, డ్రైవర్స్ కాలనీ, గుర్రాలచెర్వు సమీపంలో స్వయంభుగా వెలసిన కనకదుర్గమ్మ ఆలయం వద్ద, రామాలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.