లలిత్‌ మోడీకి సహాయం చేయలేదు

2
– మానవతా దృక్పథంతో స్పందించా: సుష్మా

న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి):

లలిత్‌మోదీ కోసం బ్రిటన్‌ ప్రభుత్వానికి తాను ఎలాంటి సిఫార్స్‌ చేయలేదని కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో గత రెండు నెలలుగా తనపై అనవసర ప్రచారం జరుగుతోందని అన్నారు. గురువారం లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ… రెండు నెలలుగా తనపై విూడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలకు సంబంధించి చర్చకు సిద్ధంగా ఉన్నానని సభలోనే చెప్పానని వెల్లడించారు. లలిత్‌మోదీకి సంబంధించి నిర్ణయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వానికే వదిలేసినట్లు వెల్లడించారు. లలిత్‌మోదీ కోసం బ్రిటన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు లేఖ, ఈ-మెయిల్‌, సందేశం ఉంటే చూపించాలని కోరారు. లలిత్‌మోదీ భార్య గత 10 ఏళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోందన్నారు. లలిత్‌మోదీకి తాను ఆర్థిక లాభం చేకూర్చానా, దేశం విడిచి పారిపోయేందుకు సహకరించానా అని ఆమె ప్రశ్నించారు. లలిత్‌ మోదీ వ్యవహారంలో సుష్మాస్వరాజ్‌ రాజీనామా చేయాలని గత కొంతకాలంగా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుష్మాస్వరాజ్‌ గురువారం లోక్‌సభలో తన వాదనను వినిపించారు. లలిత్‌మోదీ కోసం బ్రిటిష్‌ ప్రభుత్వానికి తాను ఎలాంటి సిఫారసు చేయలేదని  స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని ఆమె  అన్నారు. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నానని సుష్మ పునరుద్ఘాటించారు. ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపించాలంటూ… అందరి ప్రశ్నలకూ సమాధానాలు చెబుతానని తెలిపారు. చర్చకు అనువైన వాతావరణం సభలో లేదని సుష్మాస్వరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజావార్తలు