లస్మన్నపల్లిలో ప్లాస్టిక్ నిషేధం పై ర్యాలీ
సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 22 మండల పరిధిలోని లస్మన్నపల్లి గ్రామంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న దుకాణదారులకు నోటీసులు అందించారు. అనంతరం సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ …సింగిల్ యూస్ ప్లాస్టిక్ అయినా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు ,బాటిల్స్ గ్రామంలోని కిరాణా దుకాణ యజమానులు విక్రయించరాదని కోరారు. ఒకవేళ విక్రయిస్తే భారీ జరిమానాలు విధిస్తామని యజమానులను హెచ్చరించారు. అనంతరం ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను, మానవ మనుగడ పై చూపే ప్రభావాన్ని ప్రజలకు, దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి ,ఉపసర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి ,వార్డు సభ్యులు రేగుల సురేష్ ,దాసరి రవి, బండ సరోజన, దొనపాటి రమాదేవి, మాతంగి వెంకటయ్య, తలారి శ్రావణి మురళి, కొట్టే వెంకట్ రెడ్డి,అంగన్వాడి టీచర్ స్వరాజ్యం, ఆశా కార్యకర్త నిర్మల,గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.