లాటరీ పద్ధతి ద్వారా వైన్ షాపులో ఎన్నిక
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.గద్వాల నడిగడ్డ, ఆగస్టు 21 (జనం సాక్షి);
జిల్లా లో ప్రొహిబిషన్ అబ్కారి శాఖ వైన్ షాపుల ఎంపిక ప్రక్రియ 36 వైన్ షాప్ ల కేటాయింపు ను లాటరి పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
సోమవారం నూతన సమీకృత కార్యాలయ సమావేశం హాలు నందు జిల్లా అభ్కారీ శాఖ అద్వర్యంలో ఏర్పాటు చేసిన లాటరి డిప్ కార్యక్రమం లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వ్యుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ప్రక్రియ లాటరి పద్దతి లో జరుగుతుందని తెలిపారు. మధ్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున, జిల్లాలో ఉన్న 36 వైన్ షాపులలో , రిజర్వేషన్ ప్రకారం జిల్లా బి.సి, ఎస్సి, ఎస్టి సంక్షేమ శాఖల అధ్వర్యంలో గౌడ్స్ కు 5, ఎస్సి లకు 6 షాప్ లు కేటాయించామని, ఎస్టి లలో ఎవరు లేనందున వారికి వైన్ షాప్ లు రిజర్వ్ చేయలెదని, మిగిలిన 25 వైన్ షాపులను ఓపెన్ కేటగిరీలో కేటాయిoచామని తెలిపారు. వైన్ షాపుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యుల్ , దరఖాస్తుల స్వికరణ మొదలైన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను పంపడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమం లో జిల్లా అబ్కారి శాఖ అసిస్టెంట్ అధికారి నరసింహ రెడ్డి, , ఎస్ ఐ గోపాల్ , సంబదిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.