లాభదాయకమైన సాగుపై రైతులకు అవగాహన
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 18 మండలంలోని గ్రామంలో మంగళవారం ఆయిల్ ఫామ్ మొక్కల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారిని స్వాతి మాట్లాడుతూ రైతులు స్వయంకృషితో ఎదిగే విధంగా కృషి చేయాలని కోరారు మొక్కల సాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయన్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆయిల్ ఫామ్స్ సాగు మొక్కలపై రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు చిన్న కారు సన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నారు ముఖ్యంగా మొక్కల పెంపకం ఎదిగిన తర్వాత సంవత్సరాలపాటు ఈ మొక్కలు ఉంటాయన్నారు ఈ మొక్కల వలన అనేక లాభాలు ఉన్నాయన్నారు ఇందుకు రైతులు ముందుకు రావాలని కోరారు సాంకేతిక పరిణామాలతో సాగు చేసే పంటలపై అవగాహన ఉంటే రికార్డు స్థాయిలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు అవగాహన చేసుకోవాలన్నారు కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు