లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు:ఒకరి మృతి

నల్లగొండ: సూర్యాపేటలో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… మరో 10 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి విశాఖపట్టణంకు చెందిన కందుకూరి అవినాష్‌గా గుర్తించారు. వైజాగ్‌ నుంచి ఆరెంజ్‌ ట్రావెల్స్ బస్సులో ఎంసెట్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్‌ నిద్రమత్తులో బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.