లారీల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పక్కదారి పడుతున్న 500 క్వింటాళ్ల ,లక్షల విలువ చేసే రేషన్‌ బియ్యం ను రెండు లారీలను వల వేసి రామచంద్రపురం యూనిట్‌ సివిల్‌ సప్లై విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా.. పటాన్‌చెరు ముత్తంగి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ దగ్గర సివిల్‌ సప్లై ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ దాడులు నిర్వహించాయి. హైద్రాబాద్‌, ఘట్కేసర్‌, కీసర, భువనగిరి పరిసర ప్రాంతాలు నుండి సేకరించి పఠాన్‌ చేరు పారిశ్రామిక వాడలో నిల్వవుంచి అక్కడి నుండి లారీలలో సుమారు 10 లక్షల విలువగల రేషన్‌ బియ్యాన్ని కర్ణాటక ,బీదర్‌, ఔరంగబాద్‌ కు. తరలిస్తున్నారు. ఇలా రెండు లారీలను, 400 కింటాలు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పఠాన్‌ చేరు పారిశ్రామిక వాడలో పాడుబడ్డ పరిశ్రమలో నిలువ ఉంచిన మరో 100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మెహిదీపట్నం అసిఫ్‌ నగర్‌ కు చెందిన నిర్వాహకుడు మొహమ్మద్‌ రఫీక్‌ను ఆధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేశామని విూడియాకు తెలిపారు.