లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.