లారీ దగ్ధం
కరీంనగర్, (మార్చి24): కరీంనగర్ జిల్లా రామగుండంలో ప్రమాదం జరిగింది. బి పవర్‌హౌస్ వద్ద ప్రయాణిస్తున్న లారీకి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో, లారీ అక్కడికక్కడే దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.