లారీ దూసుకెళ్లి ముగ్గురి మృతి

ప్రకాశం: జిల్లాలోని అద్దంకి మండలం గోవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలుచున్న వారిపై ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని వెంటనే అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా గోవాడ గ్రామస్థులు.