లాల్‌సింగ్‌ చద్దా కోసం వెయిటింగ్‌


గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ హవానే కొనసాగుతోంది. అయితే రీసెంట్‌ డేస్‌ లో మళ్లీ బాలీవుడ్‌ లో సత్తా చాటేందుకు వస్తోన్న చిత్రం ఆవిూర్‌ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ ఛద్దా. ఇటీవలే మెగాస్టార్‌ ఇంట్లో ఆవిూర్‌ ఖాన్‌ మెగా ప్రివ్యూ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్‌ ప్రివ్యూకు మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు తన భావోద్వేగాన్ని సోషల్‌ విూడియా వేదికగా పంచుకున్నారు.