లైనుమెన్‌పై కేసును నిరసిస్తూ ధర్నాకు దిగిన ఉద్యోగులు
బెల్లంపల్లి, జనంసాక్షి: మండలంలోని పెర్కపల్లి గ్రామంలో విద్యుత్‌షాక్‌తో ఆవు మృతిచెందిన ఘటనలో సహయ లైన్‌మెన్ రాజేంద్రపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘం నాయకులు ధర్నా నిర్వహించి రాజేంద్రపై కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కె. శంకరెడ్డి, కార్యదర్శి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.