లోకాయుక్త ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : బషీర్‌బాగ్‌లోని లోకాయుక్త కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సంతాన సాఫల్యం కోసం ఎమ్. ఆర్. టీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డా. రోజా రోయాట్టీ తమను మోసం చేసి రూ. 12లక్షల తీసుకున్నారని బంజారాహిల్స్‌కు చెందిన చంద్రశేఖర్, ప్రసన్న దంపతులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులకు, రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ తమకున్యాయం జరగలేదని బాధితులు పేర్కొన్నారు. స్థానిక బంజారాహిల్స్ పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోకుండా తమను వేధిస్తున్నారని అరోపించారు. ఫిర్యాదు చేసిన అనంతరం బయటకు వచ్చిన బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మయత్నం చేశాడు.