లోక్ సభ మరోసారి వాయిదా
న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై విపక్షాలు లోక్‌సభలో నాలుగో రోజు ఆందోళన కొనసాగిస్తున్నాయి, ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి మధ్యాహ్నం సమావేశం కాగానే విపక్ష సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టారు. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.