వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ ఆందోళన

` తక్షణం చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి డిమాండ్‌
` ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనలు
` నిరసనలకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సంఫీుభావం
హైదరాబాద్‌(జనంసాక్షి):వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ముస్లింలు ఆందోళన చేపట్టారు. బషీర్‌బాగ్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి విగ్రహం వద్ద నిరసన తెలిపారు.వక్ఫ్‌ బిల్లుకు నిరసిస్తూ ఈ నెల 19న హైదరాబాద్‌లో ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు మతపెద్దలు, పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని వెల్లడిరచారు. ముస్లింల ఆందోళన నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద వక్ఫ్‌ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్ల హుస్సేన్‌, ఫయిం ఖురేషి, మైనార్టీ ఫైనాన్స్‌ చైర్మెన్‌ ఒబెదుల్లా కొత్వాల్‌, హెచ్‌ కమిటీ చైర్మెన్‌ సయ్యద్‌ కుష్రవ్‌ పాషా,ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఫయిం, షేక్‌ అక్బర్‌, ఉస్మాన్‌ హల్‌ అజ్రీ తదితరులు పాల్గొన్నారు.