వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే తప్పేంటి

మంత్రి రామచంద్రయ్య

వరంగల్‌ : చిరంజీవి చరిష్మాగల నాయకుడని, వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే తప్పేంటని మంత్రి సి. రామచంద్రయ్య ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు తనపై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమణలకు గురయ్యాయని, ఆ భూములను క్రమబద్ధీకరించే యోచనలో ప్రభుత్వం ఉందని రామచంద్రయ్య చెప్పారు.