వచ్చే ఏడాది డీఎస్సీ: కడియం

1

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) :

వచ్చే విద్యాసంవత్సరంలోగా డీఎస్సీని నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు అందాయని…కానీ ఇప్పటికిప్పుడు డీఎస్సీ నిర్వహించలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే స్కూళ్లలో ఉన్న ఖాళీలను ఈ ఏడాది విద్యావాలంటీర్లతో తక్షణమే భర్తీ చేస్తామన్నారు. డైట్‌సెట్‌ ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 67.7 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని, వచ్చే విద్యా సంవత్సరంలోపు డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రీజనలైజేషన్‌ పక్రియ ఓ కొలిక్కి వస్తుందని కడియం చెప్పారు. సెప్టెంబర్‌ నెలాఖరులోగా విద్యా వాలంటీర్లను నియమిస్తామని ఆయన వెల్లడించారు. 1,05,382 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, వారిలో 71,317 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని కడియం తెలిపారు.