వచ్చే ఏడాది నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్య
– గురుకుల పాఠశాలల ఏకీకరణపై విస్తృత చర్చ
– త్వరలో వర్సిటీల వీసీల నియామకం
– ఉప ముఖ్యమంత్రి కడియం
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి):
కెజీ టూ పిజి విద్యకు అనుగుణంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గురుకుల పాఠశాలల ఏకీకరణపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సవిూక్ష సమా వేశం నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి విూడి యాతో మాట్లాడుతూ…. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. గురుకుల పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్రభు త్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది 1190 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు. ప్రతి నియోజకవ ర్గానికి 10 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందించేలా రూపకల్పన చేశామని అన్నారు. కేజీ టు పీజీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేం దుకు నిపుణులు సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేజీ టూ పీజీని మూడు సెగ్మెంట్లుగా విభజించామన్నారు. ఒకటి నుంచి 4వ తరగతి వరకు ఒక సెగ్మెంట్‌గా, 5 నుంచి 12వరకు ఒక సెగ్మెంట్, 12 నుంచి పీజీ వరకు ఒక సెగ్మెంట్‌గా విభజించినట్లు చెప్పారు. 2016-17 నుంచి ఇంగ్లీష్ విూడియంలో గురుకుల పాఠశాలలు పనిచేస్తాయని మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 10 గురుకుల పాఠశాలలు ఉండాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగం నిరాదరణకు గురైందని, అందుకే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి పది రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే రెండేళ్లలో 1,190 గురుకుల పాఠశాలలను నిర్మిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 7.5 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. నాలుగు నెలల్లో విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లు, వీసీల నియామకం చేపడతామని వెల్లడించారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలు చేపడతామన్నారు. కళాశాలల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి మెరుగైన విద్య అందిస్తామన్నారు. విద్యాశాఖలో అవినీతి, అక్రమాల నివారణకు ఆన్‌లైన్‌లో సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు ద్వారా అందించే సేవలను ఆన్‌లైన్‌లో ఉంచాం. ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రొఫెసర్ల నియామకాలు లేక విశ్వవిద్యాలయాలు గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 4 నెలల్లో విశ్వవిద్యాలయాలకు పాలకమండళ్లు, వీసీల నియామకం చేపడతామన్నారు. దేశంలోనే మొదటి సారిగా సన్న బియ్యం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో పేద పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. . పిల్లలకు గ్రాముల ప్రకారం కాకుండా కడుపునిండా అన్నం పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు పిల్లలకు కడుపునిండా అన్నం పెడుతున్నాం. ఎస్సీ, ఎస్టీలకు లక్షలోపు రుణం తీసుకుంటే 80 శాతం, రెండు లక్షల పైన లోను తీసుకున్నవారికి 60శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. వర్సిటీల్లో సిబ్బంది నియామకాలు లేకపోవడంవల్లే న్యాక్ గుర్తింపును కోల్పోవాల్సి వచ్చిందని కడియంచెప్పారు. గత ప్రభుత్వాల తప్పులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరిదిద్దుతోందని కడియం అన్నారు. ఓపెన్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కడియం ఈ సందర్భంగా తెలియజేశారు. ఇదిలావుంటే గతంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదన్నారు. ఈ ప్రభుత్వానికి విమర్శనాత్మక సూచనలు ఇవ్వకుండా, ఎంతసేపు ఈ ప్రభుత్వం పడిపోతే ఆ సీట్లో కూర్చుందామా అన్ర ధోరణితో ఉన్నారని విమర్శించారు.