వచ్చే విద్యాసంవత్సరానికి టీచర్ల పోస్టుల భర్తీ
– ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సంగారెడ్డి,డిసెంబర్ 19(జనంసాక్షి): వచ్చే విద్యాసంవత్సరం ఆరంబానికి ముందే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఆయన శనివారం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లోని తెలంగాణా సాంఘీక గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన స్వారో ఒలంపిక్స్ రెండవ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ విూట్ 2015ను ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా కడియం మాట్లాడుతూ వివిద పాఠశాలల్లో ఉన్న ఖాళీల వివరాలను తెప్పిస్తున్నామన్నారు. తెలివి ఎవరి సొత్తు కాదని, చదువుకునే చక్కటి వాతావరణం కల్పిస్తే గురుకుల పాఠశాల విద్యార్థులు చదువులో అద్బుతమైన ఫలితాలు సాధిస్తారన్నారు. విద్యార్థులకు సరైన మార్గంలో గైడ్ చేస్తే కార్పోరేట్ సంస్థలకు ధీటుగా పనిచేస్తారన్నారు. క్రీడలు చదువులో బాగమేనని,ద ఈనివల్ల స్పోర్టివ్ నెస్ పెరగుతుందన్నారు. రియల్ ఒలంపిక్స్ కు ఏమాత్రం తీసిపోని విదంగా విద్యార్థులు విన్యాసాలు చేశారన్నారు. బంగారు తెలంగాణా అంటే ఎక్కడోలేదని, విూ విూద్యనే ఉందని అదిసాధించేందుకు ఉన్నత చదువులు చదివి లక్ష్యాన్ని సాధించాలన్నారు., బడుగు బలహీన వర్గాల వారి చదువులో ఉన్నత స్తితికి చేర్చేందుకై పేద, దనిక తారతమ్యం లేకుండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ప్రవేశపెడుతున్నామన్నారు. ఉపాధ్యాయులు తాము ఉద్యోగులుగా భావించకుండా విద్యార్థులు తమ పిల్లలు అనే కోణంలో ఆలోచించి వారిని అక్కున చేర్చుకొని విద్యను అందించాలన్నారు. ఉపశాసనసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్పోరేట్ సంస్థలకు దీటుగా గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని, అంతేరీతిలో విద్యార్థులను తీర్చి దిద్దుతున్నాయన్నారు. విద్యలో బాగంగా విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం వల్ల ఆత్మ స్థైర్యం పెరుగుతుందన్నారు. మెదక్ ఎంపి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు పాఠశాల బలోపేతం కోసం ముందుకు రావాలన్నారు. జిల్లాలో వసతి గృహాల అభివృద్దికి కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్ర గురుకుల పాఠశాలల సొసైటి కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్దికి ఎంతగానో కృషిచేస్తున్నారని, వ్యక్తులుగా కాకుండా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే నిజమైన ఫలితాలు వస్తాయన్నారు., గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు అనేక రంగాల్లో అబివృద్ది చెందేందుకు తనవంతు సహాయ సహాకారాలందిస్తున్నానని తెలిపారు రాష్ట్రంలో మరిన్ని గురుకులాలు కొత్తగా ఏర్పాటు చేయనన్నామని వీటి విషయంలో విధానం అమలు చేసేందుకు కమిటీవేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికై క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్ రెడ్డి, పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. ఈసందర్బంగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్ అతిథులను, ఆహుతులను ఆకట్టుకుంది.కాగా త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. 2016-17 విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వం, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పోస్టుల ఖాళీలను గుర్తించే పనిచేస్తున్నామని అన్నారు. ఆయా స్కూళ్లలో ఉన్న ఖాళీలను గుర్తించి త్వరలోనే దీనికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా కొత్తగా గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కేజీ టు పీజీ విద్యా విధానం రూపకల్పన చేస్తున్నామని తెలిపారు.