వజ్రోత్సవ క్రీడలకు ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ గీకురు
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగస్టు 21: మండల కేంద్రములో ఆజాద్ కి అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దాస సుధాకర్ ఆధ్వర్యములో ఆదివారం బ్యాట్ మెంటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ హాజరై క్రీడా పోటీలకు టాస్ వేసి ప్రారంభించారు. ఈ క్రీడలకు మండలము నుండి 14 టీములు పాల్గొన్నాయి.ఈ పోటీల నిర్వహణ కార్యక్రమములో స్థానిక ఎస్సై దాస సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపెల్లి తిరుపతి టిఆరెస్ నాయకులు మహమ్మద్ సర్వర్ పాషా, బుర్ర శ్రీనివాస్ గౌడ్, చెప్యాల శ్రీనివాస్ వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.