వడగండ్ల వానతో పంటలకు అపారనష్టం
మంథని గ్రామీణం, జనంసాక్షి: మంతని మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగండ్లవానకు ఐదు గ్రామాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని నాగపల్లి, స్వరపల్లి, వెంకటాపూర్, మల్లారం, అడవిసోమనపల్లి గ్రామాల్లో సుమారు గంటసేపు కురిసిన వడగండ్ల వానకు వరిపైరు నేలకొరిగింది. మొక్కజొన్న, మిర్చి పంటలు అపార నష్టం వాటిల్లింది. వెంకటాపూర్ నాగపల్లి గ్రామాల్లో గాలివానకు మూడు ఇళ్లల్లో పైకప్పులు లేచిపోయాయి. పంట చేతికి వచ్చిన సమయంలో నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు.