వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి
నిజామాబాద్, జనంసాక్షి: వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రయాణికుడు నందిపేట నుంచి నిజామాబాద్ వస్తుండగా మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన రాజుగా గుర్తించారు.