వడదెబ్బకు 13 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడదెబ్బకు ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. ఈరోజు ఉదయమే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, విశాఖ, కడప , వరంగల్‌ , చిత్తూరు, రంగారెడ్డి , కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున భానుడి ప్రతాపానికి మృత్యువాతపడ్డారు.