వడదెబ్బకు 92 మంది మృతి
హైదరాబాద్ : రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా వివరాలు. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో 10 మంది చొప్పున, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 9 మంది చొప్పున కృష్ణాలో 8మంది. కరీంనగర్, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, ఆదిలాబాద్‌లో నలుగురు, శ్రీకాకుళం, ఖమ్మం, తూర్పుగోదావరి , నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున , నెల్లూరు, చిత్తూరు, మహబూబ్‌నగర్, పశ్చిమగోదావరి , కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప , అనంతపురం, గుంటూరు, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.