వడదెబ్బతో 117 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శనివారం వడదెబ్బ తీవ్రతకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 12 మంది చొప్పున , కృష్ణా, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో ఏడుగురు చొప్పున భానుడి ప్రతాపానికి బలయ్యారు. విజయనగరం, విశాఖ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, నిజామాబాద్‌ , అనంతపురం, ఖమ్మం , మెదక్‌ జిల్లాల్లో నలుగురు చొప్పున , చిత్తూరు, ఆదిలాబాద్‌ , శ్రీకాకుళం, హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున , కర్నూలు జిల్లాలో ఒకరు వడదెబ్బతో మృతిచెందారు.