వడదెబ్బ మృతులపై ముఖ్యమంత్రికి హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌ : వడదెబ్బ మృతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెరాస నేత హరీష్‌రావు లేఖ రాశారు. ఎండలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ పరీక్షతో పాటు అన్ని పరీక్షలు వాయిదా వేయాలని హరీష్‌రావు కోరారు.