వడ్డెర సంఘం నూతన కమిటి ఎన్నిక.అధ్యక్షుడిగా గుంజ బిక్షం, ప్రధాన కార్యదర్శిగా ఓర్సు యాదగిరి,
నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. పట్టణంలో వడ్డెర సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు,ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా, ఎన్నుకున్నారు.వడ్డెర సంఘం నూతన కమిటీ,అధ్యక్షుడిగా గుంజ బిక్షం,ఉపాధ్యక్షులు, వేముల భుజేశ్వరావు,వేముల రాజేష్,ప్రధాన కార్యదర్శి ఓర్సు యాదగిరి,సహాయ కార్యదర్శి వేముల శివ, సహాయకార్యదర్శి గుంజరామకృష్ణ,కోశాధికారి గుంజ రవీందర్,వడ్డెర కుల బంధువుల సమక్షంలో ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుంజ బిక్షం,మరియు కమిటీ మాట్లాడుతూ నూతన కమిటీని ఎన్నుకున్న వడ్డెర కుల బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ,వడ్డెర కుల బంధువులందరూ కలిసికట్టుగా ఉండాలని, ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరితో కలిసి సహాయ సహకారాలు అందిస్తానని,సంఘాన్ని బలోపితం చేయడానికి సంఘ సభ్యులు అందరూ కృషి చేయాలన్నారు.అనంతరం కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తురక వెంకటేశ్వర్లు,తమ్మిశెట్టి రాజేష్,మక్కల నాగమ్మ,రూపని ఉదయ్,రూపని మహేష్,గుంజ సంతోష్,తురక వెంకటేశ్వర్లు,గుంజ మధు,కట్టెల లక్ష్మణ్,ఏం శ్రీనాథ్,గుంజ సురేష్,దేవర్ల వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.