*వడ్డేమాన్ శనీశ్వర స్వామికి ప్రత్యేక తిల తైలా అభిషేక పూజలు.
బిజినపల్లి . జనం సాక్షి . సెప్టెంబర్ .10.మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ సార్థా సప్త జేష్ట మాత సమేత శనేశ్వర స్వామికి భాద్రపద మాసం పౌర్ణమి శనివారం నాడు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు దర్శించుకుని , ప్రత్యేక తిలతల అభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ శనేశ్వర స్వామికి శని గ్రహదోష నివారణకు ప్రత్యేకంగా అభిషేకాలు అష్టోత్తర పూజలు నిర్వహించుకొని గ్రహదోష ఉపశమనం పొందుతున్నట్లు తెలిపారు శనివారం కావడంతో వివిధ ప్రాంతాలు, జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో గల బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ప్రత్యేకంగా రుద్రాభిషేకాలు, అర్చనలు, భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, అనంతరం స్వామివార్లకు నివేదించిన ప్రత్యేక నైవేద్యాలను తీర్థ ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాలరావు ,గ్రామ సర్పంచ్ వంగ సుదర్శన్ గౌడ్, కమిటీ సభ్యులు వీరశేఖరాచారి, ఆలయ సహాయ అర్చకులు శాంతి కుమార్,ఉమ్మయ్య , జంగం మల్లికార్జున్,జయంత్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.