వన్యప్రాణులను కాపాడాలి
ఆదిలాబాద్, జనవరి 31 (: వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అశోక్ అన్నారు. జిల్లాలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం కవ్వాల్ అటవీ ప్రాంతంలో మన్యప్రాణుల ప్రాణహిత శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో 10 కిలో మీటర్ల దూరంలో జాతీయ వన్యప్రాణులు సంరక్షణపై ప్రణాళికలు సిద్ధం చేసి ఫిబ్రవరి 15వ తేదీలోగా తను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హద్దులకు 15 కిలో మీటర్ల దూరంలో గనులు, రోడ్లు, పరిశ్రమలు ఉన్నట్లయితే వాటిని అనుమతుల కోసం ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. మన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.