వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయాలి

జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం -2007పై జిల్లా మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని మీటింగ్ హల్ నందు సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని వయోవృద్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ మాట్లాడుతూ తల్లిదండ్రుల , వయోవృద్ధుల పోషణ, సంక్షేమం కొసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల, వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచడానికి జిల్లాలో అన్ని రెవెన్యూ డివిజన్లలో అర్డిఓ స్థాయి అధికారులతో పోషణ ట్రిబ్యునల్ నీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అదే విధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అప్పిలెట్ ట్రిబ్యునల్ కూడా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జిల్లా స్థాయి వయోవృద్ధుల సంక్షేమ చట్టం అమలు కోసం క్షేత్ర స్థాయిలో అవగహన సదస్సులు నిర్వహిస్తూ, వారి హక్కులను తెలియజేయడం జరుగుతుందన్నారు.వైద్య శాఖ సమన్వయంతో విధిగా గ్రామీణ స్థాయిలో వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేయడం, వయోవృద్ధుల ఆస్తుల, ప్రాణరక్షణకై పోలీస్ శాఖ సమన్వయంతో చట్టాన్ని పటిష్టంగా అమలు కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కొసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో 59,716 మంది వయోవృద్ధులకు ప్రతినెల వృద్ధాప్య పింఛన్లు అందిచడం జరుగుతుందని, రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధులకు రాయతి కల్పిస్తుందని, రాయుతి పొందేందుకు అవసరమైన గుర్తింపు కార్డులు జిల్లా వయోవృద్ధులు సంక్షేమ శాఖ అధ్వర్యంలో జారీ చేయడం జరిగిందని తెలిపారు.అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం -2022 వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి , ఎఫ్ఆర్ఓ వినోద్ , జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్, వయోవృద్ధుల సంక్షేమ చట్టం డివిజన్ కమిటీ సభ్యులు, సూర్యాపేట రెవెన్యూ డివిజన్ సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area