వరంగల్ కేటీపీపీలో సాంకేతిక లోపం
వరంగల్, జనంసాక్షి: కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో అప్రమత్తమైన
అధికారులు ఐదు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు. కాగా మరమ్మత్తుల పనులు పూర్తికావడానికి రెండ్రోజులు పడుతుందని నిపుణులు తెలిపారు.