వరంగల్‌ మేయర్‌ ఎన్నికపై కెటిఆర్‌ కసరత్తు

ఎమ్మెల్యేలతో సవిూక్ష

హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ మేయర్‌ ఎంపిక కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పరేషన్‌ పరిధిలోని ఐదుగురు శాసనసభ్యులు, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డిలతో అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్‌ ప్రాథమిక చర్చలు జరిపారు. మేయర్‌ నన్నపనేని నరేందర్‌ వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నిక కావడంతో కొత్త మేయర్‌ ఎంపిక అనివార్యమైంది. వరంగల్‌ వెస్ట్‌ శాసనసభ్యుడు వినయభాస్కర్‌, వర్దన్నపేట శాసన సభ్యుడు ఆరూరి రమేష్‌, వరంగల్‌ ఈస్ట్‌ శాసన సభ్యుడు నన్నపనేని నరేందర్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. స్టేషన్‌ ఘణపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలతో సమావేశం నుంచే కేటీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలతో ఇంకా మరింత మంది అభిప్రాయాలు తీసుకుని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ కు నివేదించి వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్‌ సమావేశంలో తెలిపారు.