వరంగల్‌ స్మార్ట్‌ కోసం వేయికోట్లు: మేయర్‌

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి వేయికోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ, హృదయ్‌ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సవిూక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి 100 కోట్లు వచ్చేలా ప్రతిపాదనలు పంపించామని మేయర్‌ నరేందర్‌ తెలిపారు. దేశంలోనే స్మార్ట్‌ సిటీలను నిర్మిస్తున్న లీ అసోసియేట్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. నాళాల ప్రక్షాళన కోసం రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. వేయి స్తంభాల గుడి చుట్టూ రోడ్‌ నిర్మిస్తామని తెలిపారు. దానికొరకు ఇప్పటికే 75 శాతం స్థల సేకరించామన్నారు. ప్రజలకు ఉపయోగ పడేవిధంగా బయో మెకనైజేషన్‌ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించామని మేయర్‌ వెల్లడించారు.