వరంగల్ అండర్ రైల్వే గేట్ లో రాఖి పండుగ సంబరాలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 31 (జనం సాక్షి) అన్నయ్య కలలే పండేను చెల్లాయి మనసే నిండెను అనుకుంటూ అన్నా చెల్లెలు ఒకరికొకరు అనురాగం ఆప్యాయతను కలబోసుకునిరక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకొని నగరంలోని అండర్ రైల్వే గేట్ ఏరియా శివనగర్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకున్నారు. రక్షాబంధన్ అంటే తోబుట్టువులకు ఎల్లవేళలా తోడు నీడగా ఉంటానని అన్నయ్యలు అభయమిచ్చే పర్వదినం రక్షాబంధన్. వివిధ ప్రాంతాలలో సెటిల్ అయిన వారు రక్షాబంధన్ రోజు తమ సోదరుల ఇండ్లకు విచ్చేసి రాఖీ కట్టి మిఠాయి తినిపించి అనుబంధాలను నెమరు వేసుకున్నారు. అందరూ తల్లిదండ్రుల ఇండ్లలో కలుసుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని కుశలక్షేమ సమాచారాలు పరస్పరం సంభాషించుకుని తల్లిదండ్రుల కండ్ల ముందర కన్నుల పండుగగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకున్నారు. నగరం నుండి వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు రక్షాబంధన్ రోజు తమ స్వగృహాలకు చేరుకొని తోబుట్టులతో కలిసి ఆనందోత్సవాల మధ్యన రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకున్నారు.