వరంగల్ ఎంజీఎంలో ఓపీ సేవలు నిలిపివేత
వరంగల్ మహా నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో గురువారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు గోపి సేవలను నిలిపివేశారు. మూడు నెలలుగా తమకు రావాల్సిన స్టైఫండ్ రాకపోవడం వల్ల ఓపీ సేవలు నిలిపివేసినట్లు వైద్యులు వివరించారు. సుమారు 55 మందికి స్టైఫండ్ రావాలని వారు పేర్కొన్నారు. ఓ పి సేవలు నిలిపివేయడం వల్ల వైద్య సేవల కోసం వచ్చిన పలువురు రోగులు ఇబ్బంది పడ్డారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రెసిడెంట్ వైద్యులు డిమాండ్ చేశారు.