వరంగల్ తూర్పులో నూతన శకం.. -నన్నపునేని నర్సింహమూర్తి ట్రస్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నరేందర్..

-ఉచిత శిక్షణ,ఉచిత బోజనం,ఉచిత మెటీరియల్..
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…
వరంగల్ ఈస్ట్, జూన్ 22(జనం సాక్షి):
వరంగల్ తూర్పులో నూతన శకానికి నాంది పడింది.ప్రజా సేవలో ముందుకెలుతున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  తండ్రి  నన్నపునేని నర్సింహ మూర్తి  పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ను బుధవారం వరంగల్ లో ఏర్పాటు చేసారు..ఈ ట్రస్ట్ ను ఎమ్మెల్యే సతీమణి నన్నపునేని వాణి,కుమారుడు నన్నపునేని లోకేష్ పటేల్ సమక్షంలో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు..ఈ ట్రస్ట్ ద్వారా పలు సేవకార్యక్రమాలు,శిక్షణ కార్యక్రమాలు నిర్వహంచనున్నారు..అందుకు సంబందించిన లోగోను,అప్లికేషన్ ఫామ్ ను,కరపత్రాన్ని ఎమ్మెల్యే నరేందర్ ఆవిష్కరించారు.అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మా తండ్రిగారైన నన్నపునేని నర్సింహ మూర్తి పేరిట NN చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది..ఈ ట్రస్ట్ ద్వారా  సమాజానికి ఉపయోగ పడే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..నా సతీమణి వాణి,నా కుమారుడు లోకేష్ పటేల్ ఈ ట్రస్ట్ ను ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది..వారి సమక్షంలో సేవాకార్యక్రమాలు జరుగుతాయి..అందులో బాగంగా ఈ రోజు లోగోను,కోచింగ్ కు సంబందించిన కరపత్రం,అప్లికేషన్ ఫామ్ ను ఆవిష్కరించడం జరిగిందన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ,పురపాలక మంత్రి కేటీఆర్  దృడ నిశ్చయంతో ఉద్యమ లక్ష్యమైన నియామకాల్లో బాగంగా వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది..వరంగల్ జిల్లాకు పలు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి..వరంగల్ తూర్పు లో  పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారికి సౌకర్యార్థం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది..పోలీస్ ట్రైనింగ్ కోసం ఒక ప్రత్యేక ఫిజికల్ ట్రైనర్ ను సైతం ఏర్పాటు చేయడం జరిగింది..గ్రూప్స్ కోసం కూడా ఫాకల్టీ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు సైకియాటిస్ట్ లను కూడా ఏర్పాటు చేయటం జరిగింది.దీన్ని మానిటర్ చేయటానికి డిప్యూటి మేయర్,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్,కార్పోరేటర్లతో ఒక కమిటీ వేయడం జరిగినట్లు చెప్పారు
రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి..క్లాసులు కూడా ప్రారంభం అవుతాయి. జూలై 1 నుండి పూర్తి స్థాయిలో క్లాసులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు
నన్నపునేని నర్సింహ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల కోసం మద్యాహ్న బోజనం మరియు శిక్షణ కు సంబందించిన మెటీరియల్ అందజేయటం జరుగుతుంది.90 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది..రాష్ట్రంలోని మేదావులు,విద్యావంతులు,మోటివేటర్స్,మాజీ ఐఏఎస్,ఐపీఎస్ లను తీసుకు వచ్చి శిక్షణ అందజేయడం జరుగుతుంది..వరంగల్ తూర్పులో ఇది ఒక కొత్త శకం.. అవుతోందనిమా తండ్రి  నర్సింహ మూర్తిగారి ఆశీర్వాదంతోనే నేను నేడు ఈ స్థానంలో ఉన్నా..ప్రజలు దీవెన నాపై ఉంది..మా తండ్రి ఎందరికో సేవ చేసిన వ్యక్తి,తను ఉన్న రంగంలో వెల మందికి ఉపాది కలిగించిన వ్యక్తి..ఆయన పేరును నిలబెట్టే విదంగా ఈ ట్రస్టును ప్రజలు,నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వచ్చే విదంగా సేవలు అందిస్తామన్నారు. అందరి సహాకారంతో శిక్షణను విజయవంతం చేస్తామన్నారుఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.