వరద ఉద్థృతిలో గల్లంతై ఇద్దరు మృతి

విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖకు వస్తున్న సూపర్‌ లగ్జరీ ఆర్టీసీ బస్సు విశాఖ జిల్లా ఎస్‌, రాయవరం సమీపంలో ధర్మవరం వద్ద రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. అందులోంచి ఇద్దరు ప్రయాణికులు దిగి వరద నీటి నుంచి దాటుకొని వెళ్లాలని ప్రయత్నించారు. ఉద్థృతి పెరగడంతో వరదలో గల్లంతై మృతి చెందారు. వీరిని విజయవాడకు చెందిన కొండలరావు, విశాఖ జిల్లా నాతయ్యపాలెం చెందిన మైఖేల్‌గా గుర్తించారు.