వరద ధాటికి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతన్నల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా….
రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపలచారీ….
బాసర,జూలై 20(జనంసాక్షి ) ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ధాటికి బాసర మండలంలోని టాక్లి, ధోడాపూర్, లాబ్ది, బిద్రెల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను బుధవారం రోజున ఢిల్లీలోని రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల చారి పరిశీలించారు. భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.వర్షాలతో చెరువులు,రోడ్లతో పాటు పంటలకు తీవ్ర నష్టం వాటిలిందని స్థానికులు రాష్ట్ర అధికార ప్రతినిధి దృష్టికి తీసుకొచ్చారు.భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లతో పాటు చెరువులు,నష్టపోయిన పంటలకు సంబంధించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వెంటనే చెరువుల మరమ్మతు పనులను యుద్ద ప్రతిపదికతో చేపడతామని పేర్కొన్నారు.అదేవిధంగా లాబ్ది,సావ్లీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.సమస్యను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.ఆయన వెంట నాయకులు సావ్లి రమేష్,అమృత్ పటేల్,పోతన యాదవ్, కుబ్రే శంకర్, జారికోటే ప్రకాష్ పాటిల్,మాధవరావు పటేల్,శంకర్ పటేల్, ధర్మా గౌడు,దీపక్,సుకాలే సాయినాథ్,సాయినాథ్,గ్రామస్థులు పాల్గొన్నారు.