అసోంను ముంచెత్తిన వరదలు
గౌహతి:వారం రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుసున్న వానలు ఆ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని 27 జిల్లాలో పూర్తిగా నీటిలో మునిగివున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థచేసుకోవచ్చు.రెండు వేల గ్రామాల్లోని 4లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.40వేల హెక్టార్లు సాగుభూమి పనికిరాకుండా పొయింది.బ్రహ్మపుత్ర దాని ఉపనదులకు పలుచోట్ల పడ్డ గండ్లు పరిసర ప్రాంతాలను వరదలతో ముంచెత్తుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం,సైన్యం,భారతీయ వాయు సేన ఎన్డీఆర్‌ఎఫ్ అందరూ సహయ చర్యల్లో నిమగ్నమైనా చేయగలగింది.ఎక్కువ కన్పించడం లేరు కేవలం 173తాత్కాలిక ఆశ్రయాలు మాత్రం ఏర్పాటయ్యాయి.