వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. సోమవారం మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా జడ్పిటిసి సూర్య,వైస్ ఎంపీపీ ఎడవెల్లి దిలీప్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ శాగం రాఘవరెడ్డి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాలలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు.కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకవెళ్ళేటప్పుడు పట్టాదారు పాసుపుస్తకం,వాడకంలో ఉన్న బ్యాంకు పాస్ పుస్తకం,ఆధార్ కార్డును రైతులు ముందస్తుగా తీసుకొని వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.రైతులకు,ధాన్యపు నిలువలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఐకెపి నిర్వాహకులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.గోనె సంచులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఇస్లావత్ పాండు నాయక్,ఎంపీడీవో ఖాజ అస్గర్ అలి,స్థానిక సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి,ఏపిఎం లక్ష్మీనారాయణ,విజయ్,తంగమణి,ఏఈఓ హేమలత,మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నారాయణదాసు రమణ,ప్రధాన కార్యదర్శి తూటిపల్లి వీరమ్మ,కోశాధికారి కనకరాజు మొగులమ్మ,వరదపాక కళమ్మ,జూపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జడ్పిటిసి సూర్య