వరిలో యాజమాన్య పధ్ధతులు వివరిస్తున్న ఏవో బాల్ రెడ్డి
చిలప్ చెడ్/జులై/జనంసాక్షి :- మండలం లోని సోమక్కపేట, రహింగూడ గ్రామాలలో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి నాట్లు వేస్తున్న పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు వరిలో సమగ్ర పోషక యాజమాన్యం వివరించడం జరిగింది అందులో భాగంగా భాస్వరం పూర్తి మోతాదు ను, పొటాష్ ఎరువు సగం మోతాదు ను వరి నాటు వేసేటప్పుడు వేసుకోవాలి, నత్రజని ఎరువులను 3 దశల్లో అంటే నాటు వేసిన 15-20 రోజులకు ఒకసారి, 40-45 రోజులకు ఒకసారి, 60-65 రోజులకు ఒకసారి వేసుకోవాలి, 3వ దశలో నత్రజని వేసేటప్పుడు సగం మోతాదు పొటాష్ ఎరువులను కూడా కలిపి వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా వరి నాట్లు వేస్తున్న రైతులు వరి నారు కోనలను తుంచివేయాలని తద్వారా కాండం తొలుచు పురుగు బారిన పడకుండా చూడవచ్చని తెలిపారు.
అదేవిధంగా PSB(భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా) ని వాడుకోవాలని తద్వారా దుక్కి మందు అయిన DAP, 20:20:0:13 వంటి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు అని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AEO భూపాల్ రహింగూడ సర్పంచ్ బన్సిలాల్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.