వరీకరణకు మద్దతిస్తే భూస్థాపితం
హుజూరాబాద్ టౌన్/ జనంసాక్షి: ఎస్సీల వర్గీకరణ మద్దతు పలికే రాజకీయ పార్టీలను భూస్థాపితం
చేస్తామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజి అన్నారు పట్టణంలోని ఐబీ అథితి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మే 25 2007 లో రాజమండ్రిలో చేపట్టిన ఆమరణ దీక్ష మాలలందరినీ చైతన్యపరించదని, వర్గీకరణ పూర్తి స్థాయిలో నిలిచిపోవడానికి ఆ దీక్షే కారణమని చెప్పారు.
మే 25న లక్షల మందితో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో మాలల సింహగర్జన మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఉపయోగాలపై దళిత గిరిజనులకు అవగాహన పెంచారు. వాటి ఉపయోగాలను వివరించారు. త్వరలోనే చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ఎస్పీ ఎస్టీ సబ్‌ప్లాన్ చైతన్య సభలు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాక సతీశ్, నాయకులు పనులు రాంమూర్తి వెంకాట్రాంనర్సయ్య రాగుల రాములు గద్దెల జయరాజ్ పనుల స్వామి నక్క నిర్మల, కోరెం నర్సింహం, వేముల విజయ్‌కుమార్, నీరటి తిరుపతి, సునందం పాల్గొన్నారు.