వరుస సినిమాలతో బిజీగా ఆది

పూర్తి కావస్తున్న తాజా చిత్రం క్రేజీఫెల్లో చిత్రీకరణ


హిట్లు, ప్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆది సాయికుమార్‌ అలరిస్తున్నాడు. ’ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్‌ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ’క్రేజీ ఫెల్లో’ ఒకటి. సిరికి ఫణికృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేశాయి. తాజాగా మేకర్స్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపు కుంటున్న ఈ చిత్రం ఆదికి మంచి బ్రేక్‌ ఇస్తుందని నమ్ముతున్నాడు. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశీ, మిర్నా విూనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కెకె రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫి:సతీష్‌ ముత్యాల, ఎడిటింగ్‌:సత్య గిడుటూరి.