వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం

మెదక్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి): జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు రిజర్వేషన్లు వర్తింపజేయడంతోనే ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాల్లో న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు సామాజిక న్యాయం దక్కుతుందని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయలకు అనుగుణం గా ప్రభుత్వ  పెద్దలు పనిచేసి రిజర్వేషన్లకు మోక్షం కలగించాలని  అన్నారు. దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగ చేపడుతున్న ఉద్యమాలతో కవులు, కళాకారులకు గుర్తింపు లభించిందన్నారు. ఏబీసీడీ వర్గీకరణతో మాలలకు ఒకింత న్యాయమే జరుగుతుందన్నారు. మాదిగల హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమ స్ఫూర్తితో గిరిజన, మైనార్టీ, వెనకబడిన తరగతులు వర్గీకరణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.  అంబేడ్కరిజాన్ని విస్తరించడమంటే న్యాయం చేయడమని అన్నారు. అంబేడ్కర్‌ అందించిన విజ్ఞానాన్ని అందరికీ పంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.